
ఈ సంవత్సరం ఆగష్టు 15 నుండి బాక్స్ ఆఫీసు వద్ద వరుసగా స్టార్ హీరోల సినిమాలు పెద్ద గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతూనే వస్తున్నాయి. ‘సికందర్’, ‘రభస’, ‘పవర్’, ‘అనుక్షణం’, ‘ఆగడు’, ‘గోవిందుడు అందరివాడేలే’. ఇలా వరుసగా స్టార్ హీరోస్ సినిమాలు రిలీజ్ అవ్వడంతో థియేటర్స్ అస్సలు ఖాళీ లేకపోవడంతో ఫైనల్ ప్రోడక్ట్ ని చేతిలో ఉంచుకొని కూడా చిన్న సినిమాలను రిలీజ్ చేయలేకపోయారు. అలా పెద్ద సినిమాల కోసం తమ సినిమాలను వాయిదా వేసుకున్న చిన్న సినిమాల వారికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ దొరికింది.
ఈ గ్రీన్ సిగ్నల్ తో చిన్న చిన్న హీరోలు, చిన్న చిన్న నిర్మాతలు తమ సినిమాలను వరుసగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అక్టోబర్ మిగిలిన 3 వీకెండ్స్ ని పలుక్ ఇఎన్మాలు బుక్ చేసుకున్నాయి. అందులో అక్టోబర్ 10న ‘పాఠశాల’, ‘రోమియో’, ‘దిక్కులు చూడకు రామయ్య’ విడుదలవుతుండగా, అక్టోబర్ 17న ‘ఒక లైలా కోసం’, ‘కరెంట్ తీగ’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే అక్టోబర్ 24న తెలుగు సినిమా ‘కార్తికేయ’ తో పాటు తమిళ డబ్బింగ్ ‘పూజ’, ‘కత్తి’ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.
ఇవి కాకుండా రిలీజ్ కి సిద్దంగా ఉన్న కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పై ఇండస్ట్రీలో వ్యూహరచన జరుగుతోంది.