దేవీశ్రీ ప్రసాద్ కి సర్ప్రైజ్ ఇచ్చిన ‘S/O సత్యమూర్తి’ టీం

DSP
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘S/O సత్యమూర్తి’ ఫస్ట్ టీజర్ ని నిన్న సాయంత్రం రిలీజ్ చేసారు. ఈ టీజర్ కి ఫ్యాన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీనికి మూడు రోజుల ముందే రిలీజ్ అయిన స్టైలిష్ స్టిల్స్ మరియు లోగోకి ఇప్పటికే మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉంది. ఇది పక్కన పెడితే ఫస్ట్ టీజర్ తో దేవీశ్రీ ప్రసాద్ కి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు.

‘S/O సత్యమూర్తి’ ఫస్ట్ టీజర్ ముగింపు ‘సే హలో టు S/O సత్యమూర్తి’s మ్యూజిక్’ అని వేసారు. ఇక్కడ విషయం ఏమిటంటే దేవీశ్రీ ప్రసాద్ ఫాదర్ పేరు కూడా సత్యమూర్తి. అందుకోసమే ఆ విధంగా ఈ చిత్ర టీం దేవీశ్రీ ని సర్ప్రైజ్ చేసారు. ఇది చూసిన దేవీశ్రీ చాలా హ్యాపీ ఫీల్ అవ్వడమే కాకుండా ఈ చిత్ర మేకర్స్ కి ట్విట్టర్ ద్వారా థాంక్స్ చెప్పాడు. ‘S/O సత్యమూర్తి’s మ్యూజిక్ అని వేసినందుకు థాంక్స్ టు త్రివిక్రమ్ సార్ అండ్ ప్రొడక్షన్ టీం. ఎందుకంటే మా నాన్న పేరు సత్యమూర్తి’.

ఒక్క పాట మినగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని ఈ నెల 15న రిలీజ్ చేయనున్నారు. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నారు. సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, స్నేహ, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version