50 కోట్ల క్లబ్ లో చేరనున్న అల్లు అర్జున్ మరో మూవీ

son-of-sathyamurthy

ఈ సమ్మర్ సీజన్ లో వచ్చిన మొదటి బి బడ్జెట్ మరియు బిగ్ హీరో ఫిల్మ్ ‘S/O సత్యమూర్తి’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నటించిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా, సినిమా పెద్దగా లేదని టాక్ వచ్చినా సమ్మర్ సీజన్ కావడం వలన, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమాకి క్యూ కట్టారు. ఈ కారణంగా ఈ సినిమాకి మంచి కలక్షన్స్ రావడమే కాకుండా ఇప్పటికీ ఇరు రాష్ట్రాలలోని చాలా ఏరియాల్లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.

ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ‘S/O సత్యమూర్తి’ 50 కోట్ల మార్క్ సినిమాల లిస్టులో చేరనుందని అంటున్నారు. రేపటితో ఈ సినిమా 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో 50 కోట్ల మార్క్ క్రాస్ చేస్తున్న రెండవ సినిమా ఇది. గత ఏడాది వచ్చిన రేసు గుర్రం కూడా 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. చాలా ఏరియాలలో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలను తెచ్చిపెట్టింది. సమంత, నిత్యా మీనన్, ఆద శర్మ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version