50 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ‘S/O సత్యమూర్తి’!

Son-of-satyamurty
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సూపర్‌హిట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘S/O సత్యమూర్తి’. భారీ అంచనాల మధ్య గత నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి కలెక్షన్లను తెచ్చిపెట్టారు. మొదట ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆదరించారు. ఇప్పటికే ఐదు వారాలు పూర్తైనా ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తూ తాజాగా 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

హారిక ఆన్డ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా మొత్తం ఐదు వారాల్లో 49.83కోట్ల షేర్ సాధించింది. ఇక నిన్నటి కలెక్షన్లతో 50కోట్ల మార్క్ చేరుకొని ఆ క్లబ్‌లో ఈ సినిమా చేరిపోయింది. ‘రేసుగుర్రం’ తర్వాత వెంటనే అల్లు అర్జున్ సినిమా మళ్ళీ 50కోట్ల మార్క్ చేరుకోవడం విశేషమే! అల్లు అర్జున్ యాక్టింగ్, త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్‌ ‘S/O సత్యమూర్తి’ సినిమాకు బాగా కలిసివచ్చాయి‌. సమంత, నిత్యామీనన్, అదాశర్మలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా విజయంలో మంచి పాత్ర పోషించింది.

Exit mobile version