ఏప్రిల్ 2న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ?

SO-Satyamurthy
‘అత్తారింటికి దారేదీ’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్, ‘రేసు గుర్రం’తో బంపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్‌తో కలిసి చేస్తున్న చిత్రం.. సన్నాఫ్ సత్యమూర్తి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘జులాయి’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే! ఇప్పుడదే కాంబినేషన్ మళ్ళీ మ్యాజిక్‌ని రిపీట్ చేసే పనిలో పడింది. ప్రస్తుతం స్పెయిన్‌లో ఈ చిత్రం పాటల చిత్రీకరణ చివరి దశకు చేరింది. దాంతో సినిమా షూటింగ్ పూర్తయినట్టే. ఈనెల 15న ఆడియో విడుదల జరగనుంది. ఇక సినిమా రిలీజ్ ఎప్పుడన్నదే ఆసక్తికర అంశం.

తాజా సమాచారం మేరకు.. ఏప్రిల్ 2వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న గుడ్‌ఫ్రైడే, సెలవుదినం కావడం, ఆతర్వాత శని, ఆదివారాలను కలుపుకొని స్ట్రాంగ్ వీకెండ్ కలెక్షన్లపై కన్నేశారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్ మరింత కలిసివచ్చే అంశం. సమంత, నిత్యామీనన్, అదా శర్మలు కథా నాయికలుగా నటిస్తున్నారు. ఎన్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, ఉంపేంద్రాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version