యు ట్యూబ్ లో ‘S/O సత్యమూర్తి’కి ఫుల్ క్రేజ్

Son-Of-SatyaMurty
‘జులాయి’ సినిమాతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘S/O సత్యమూర్తి’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఆడియో కూడా మార్కెట్ లోకి వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇదిలా ఉంటె ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ముందు నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ ని చాలా కొత్తగా చేస్తూ ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తిని పెంచేశారు.

‘S/O సత్యమూర్తి’ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ టీజర్ ఇప్పటికి యు ట్యూబ్ లో 9 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ కి 10 లక్షల వ్యూస్ రాగా, ట్రైలర్ కూడా మూడున్నర రోజులోనే 10 లక్షల వ్యూస్ ని క్రాస్ చేసింది. అలాగే యు ట్యూబ్ లో ఉన్న ఆడియో సాంగ్స్ కి కూడా 4.5 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇలా ఈ సినిమా రిలీజ్ కి ఉండే యు ట్యూబ్ లో ఫుల్ క్రేజ్ ని సొంతం చేసుకొని రికార్డ్ వ్యూస్ ని రాబట్టుకుంటోంది. అల్లు అర్జున్ ఈ మూవీలో సమంత, నిత్య మీనన్, ఆద శర్మలతో రొమాన్స్ చేయనున్నాడు. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాని ఏప్రిల్ మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version