సోషియా ఫాంటసీ అంశంతో.. నాగ్ సినిమా!

Akkineni-Nagarjuna
సొషియో ఫాంటసీ.. తెలుగు సినిమాలకు ఎంతగానో కలిసొచ్చే జానర్స్‌లో ఇదొకటి. తాజాగా నాగార్జున కొత్త సినిమా, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కూడా సోషియో ఫాంటసీ అంశంతోనే తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం.. సోగ్గాడే చిన్ని నాయనా. పి. రామ్ మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన రమ్య కృష్ణ, లావణ్య త్రిపాటిలు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మైసూర్‌లో షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమాలో నాగ్ ద్విపాత్రాభినయంతో అలరించనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమా సోషియో ఫాంటసీ అంశం నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తి ఆత్మ వేరొక వ్యక్తిలో చేరి కొన్ని సమస్యల పరిష్కారం కోసం పాటు పడుతుందని సమాచారం. గత కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ చెప్పి టీవీ షో, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా అలరించిన నాగ్.. ఇక పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు.

Exit mobile version