సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రానికి ‘ధర్మన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఉలగనయగన్ కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ క్వాలిటీ పరంగా అభిమానులను కాస్త నిరాశపరిచింది.
దీంతో తక్షణమే స్పందించిన మేకర్స్, తాజాగా క్వాలిటీని భారీగా ఇంప్రూవ్ చేస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రజనీకాంత్ స్టన్నింగ్ లుక్‌తో పాటు వెపన్స్, బుల్లెట్లతో నిండి ఉన్న ఈ కొత్త పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. రాశి ఖన్నా, సిమ్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
