ఎన్టీఆర్, నీల్ సెట్స్ నుంచి ఊహించని విజువల్ వైరల్.. ఫ్యాన్స్ మతిపోయింది

NTRNeel

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. ఇటీవల అనౌన్స్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ అప్డేట్ ఇంకా రిలీజ్ డేట్ లతో సోషల్ మీడియా షేకయ్యింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా పరంగా మేకర్స్ చిన్న లీక్ కూడా బయటకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ లేటెస్ట్ గా కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో కండలు తిరిగిన యాక్షన్ ఆర్టిస్ట్ లు కొందరు నేరుగా సెట్స్ నుంచే పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఫ్యాన్స్ మతిపోగొట్టేలా కనిపిస్తున్నాయి.

శాంటో అనే విదేశీ ఆర్టిస్ట్ షేర్ చేసిన ఫోటోలు అందులో సినిమా సెట్స్ ఇంకా ఇతర నటుల విజువల్స్ చూస్తుంటే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఊహించని యాక్షన్ ఫీస్ట్ నే రెడీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తారక్ స్లీక్ జిమ్ బాడీ విజువల్స్ వీరితో యాక్షన్ సీన్ లో కనిపిస్తే ఆ విజువల్ ట్రీట్ ఫ్యాన్స్ లో ఊహాతీతంగా మారింది. దీనితో ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ మరోసారి వైరల్ గా మారింది.

Exit mobile version