
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి ఓ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించనున్న సినిమా ‘సన్ అఫ్ సత్యమూర్తి'(వర్కింగ్ టైటిల్). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. ఇటీవలే హైదరబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం సాంగ్స్ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్ళారు. ప్రస్తుతం అక్కడ అల్లు అర్జున్ – సమంతలపై సాంగ్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ స్పెయిన్ షెడ్యూల్ తో ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తవుతుంది.
ఈ చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ మాట్లాడుతూ ‘మళ్ళీ బన్ని – త్రివిక్రమ్ తో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుంది. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఇందులో ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, స్నేహలు స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. స్పెయిన్ షెడ్యూల్ తర్వాత ఒక పాట మాత్రం బాలన్స్ ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని’ తెలిపారు. అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.