
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’. మొదటి సాటి అల్లు అర్జున్ సమంత, నిత్యా మీనన్, ఆద శర్మ లతో రొమాన్స్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా సూపర్బ్ కలెక్షన్స్ ని కూడా రాబట్టుకుంది. ఒక్క ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా యుఎస్, కర్ణాటకలలో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది.
ఈ సినిమా విడుదలై నెల రోజులు పూర్తి కావస్తున్నా చాలా ఏరియాల్లో స్ట్రాంగ్ గానే కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. కృష్ణా జిల్లాలో 24వ రోజు అయిన నిన్న 95,000 రూపాయల షేర్ సాధించింది. అంతే కాకుండా 24 రోజుల్లో 2.42 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. కృష్ణాలో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కేవలం మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం బన్ని – త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలు, సమ్మర్ సీజన్ లో మరే సినిమా లేకపోవడమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, స్నేహ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.