ఈ వారం విడుదలకానున్న సినిమాల్లో ‘నా లవ్ స్టోరీ’ కూడ ఒకటి. అశ్విని క్రియేషన్స్ బ్యానర్ పై జి.లక్ష్మి నిర్మాతగా శివగంగాధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహిధర్, సోనాక్షి సింగ్ రావత్ లు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి సోనాక్షి మాట్లాడుతూ తెలుగులోనే కాదు అసలు తనకు ఇదే మొదటి సినిమా అన్నారు.
అలాగే ఇందులో తాను ఒక మధ్యతరగతి అమ్మాయిలా కనిపిస్తానని, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో కంగారుగా ఉందని అంటూనే సినిమా తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుందనే ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమా ఫలితాన్ని బట్టి తర్వాతి సినిమాలకు సైన్ చేస్తానని కూడ అన్నారు. మరి అత్యధిక సినిమాల నడుమ 29న వస్తునం ఈ చిత్ర ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
