లింగా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన సోనాక్షి సిన్హా

Sonakshi-Sinha
సూపర్ స్టార్ రజినీకాంత్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘లింగా’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షూటింగ్లో ఇన్ని రోజులు అనుష్క, సోనాక్షి సిన్హాలు కూడా పాల్గొన్నారు. నేటితో సోనాక్షి సిన్హా ఈ సినిమా కోసం హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసింది. ‘లింగా సినిమాకి సంబందించిన హైదరాబాద్ షెడ్యూల్ ముగిసింది. కొద్ది రోజులు హాలిడేస్ కోసం ఇంటికి వెళ్తున్నానని’ సోనాక్షి సిన్హా ట్వీట్ చేసింది.

ఇంకా కొద్ది రోజులు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతోంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ఈ సినిమాలో ఒక పాత్రలో రజినీ దొంగగా కనిపించనున్నాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version