
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా మొదటిసారి సౌత్ లో చేసిన సినిమా ‘లింగ’. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇటీవలే సోనాక్షి సిన్హా ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని కూడా పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే టైంకి సోనాక్షి టాలెంట్ మరియూ ప్రొఫెషనల్ వర్కింగ్ గురించి ఆనోటా ఈనోటా పడి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో తిరుగుతోంది.
దాంతో మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ నిర్మాతలు, పలువురు దర్శకుల నుంచి సోనాక్షి సిన్హా ని తన సినిమాలో పెట్టుకోవాలని వరుస ఆఫర్స్ ఇస్తున్నారు. అలా అని సోనాక్షి సిన్హా వచ్చిన ఆఫర్స్ ని ఓకే చెయ్యడం లేదు. చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ లు విని తనకి సెట్ అయ్యే వాటికి మాత్రమే ఫ్యూచర్ లో సైన్ చేసే అవకాశం ఉంది. ఇవి కాకుండా తను బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది.