ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే కాన్సర్ మహమ్మారికి గురై.. కొన్నాళ్లు ఆమె విదేశాల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుని అంతిమంగా క్యాన్సర్ ను జయించిన విషయం తెలిసిందే. కాగా ఇండియాకు తిరిగొచ్చిన ఆమె.. వెంటనే షూటింగ్ కోసం సెట్స్ మీదికి వచ్చేసింది.
ఈ విషయాన్నీ ఆమె ట్వీట్ చేస్తూ.. ‘నా జీవితంలో కష్టమైన దశను దాటుకుని వచ్చాను. నేను చాల కాలం తరువాత కెమెరా ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే నెటిజన్లు మాత్రం రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో షూటింగ్ వెళ్లకుండా ఉండాల్సింది అని కామెంట్స్ పెడుతున్నారు.
