
యంగ్ హీరో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జాదూగాడు’. షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా ద్వారా ఇప్పటికే హిందీ టీవీ సీరియల్స్ లో బాగా ఫేమస్ అయిన నటి సోనారిక బడోరియా హీరోయిన్ గా పరిచయం కానుంది. జాదూగాడు సినిమాలో నుంచి రిలీజ్ చేసిన స్టిల్స్ అందరినీ బాగా ఇంప్రెస్ చేసాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ కాకముందే సోనారికకి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.
తాజాగా ఈ భామని బెల్లంకొండ శ్రీనివాస్ రెండవ సినిమా కోసం ఎంపిక చేసారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించనున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘సుందర పాండ్యన్’ సినిమాకి రీమేక్. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాని అనుకున్న తన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో సోనారికకి అవకాశం దక్కింది. ఈ సినిమా మే చివరి వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది కాకుండా బోయపాటి శ్రీను – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో కూడా ఒక హీరోయిన్ గ ఈ భామని పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.