సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో ‘నాకు కొంచెం టైం కావాలి’

Sonia-Agarwal
నాగేంద్ర, వంశీ, ఫణిచంద్ర, పల్లవి శ్రేష్ఠలను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘నాకు కొంచెం టైం కావాలి’. ఈ సినిమా ఈ రోజు లాంచనంగా ప్రారంభమైంది.

ఈ చిత్ర నిర్మాత బానూరు నాగరాజు మాట్లాడుతూ ‘డైరెక్టర్ చెప్పిన కథ, కథనం, నచ్చి ఈ సినిమాని మొదలు పెట్టాను. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్, సెకండ్ షెడ్యూల్ వైజాగ్, మూడవ షెడ్యూల్ రాజస్థాన్, జైపూర్, కులుమనాలిలో సాంగ్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తామని’ అన్నారు.

డైరెక్టర్ వెంకటేష్ రెబ్బ మాట్లాడుతూ ‘కామెడీ డ్రామాగా ఉండబోతున్న ఈ సినిమా ద్వారా భూతు లేకుండా ఓ మంచి అంశాన్ని చెప్పనున్నామని’ అన్నాడు.

Exit mobile version