విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ‘డర్టీ గ్యాంగ్‌స్టర్స్’ అనే మాస్ లిరికల్ పాటను ప్రముఖ నటుడు సోనూ సూద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఓ ముఖ్య పాత్రలో నటించడం విశేషం. దేవ్ జండ్ స్వరపరిచిన ఈ మాస్ గీతానికి కేకే సాహిత్యం అందించగా, పృథ్వీ చంద్ర, ఈకే కలిసి ఆలపించారు.
కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మాయా.వి ఛాయాగ్రహణం, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. కాగా, పూర్తి రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
