జగపతిబాబు నుంచి శివాని వరకు.. ‘సోల్ ట్రిప్’లో సందడి చేయనున్న సెలబ్రిటీలు

Soul Trip Adventure Talk Show

టాలీవుడ్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో ‘సోల్ ట్రిప్’ (Soul Trip) అనే ట్రావెల్ బేస్డ్ అడ్వెంచరస్ టాక్ షో రాబోతోంది. ‘పోస్టర్’, ‘అన్వేషి’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దాట్ల ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్మెంట్ సమర్పణలో, గండ‌భేరుండ ఆర్ట్స్ పతాకంపై విజయ్ దాట్ల స్వయంగా నిర్మించిన ఈ షో.. సాధారణ ఇంటర్వ్యూలకు భిన్నంగా సాగనుంది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ ‘సోల్ ట్రిప్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే సీజన్-1 షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ షోలో సీనియర్ నటులు జగపతిబాబు, శ్రీకాంత్, అలీతో పాటు యువ హీరోయిన్లు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వర్ష బొల్లమ్మ వంటి స్టార్స్ సందడి చేయనున్నారు. త్వరలోనే ఈ అడ్వెంచరస్ టాక్ షో ఓ ప్రముఖ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Exit mobile version