ఇప్పుడిప్పుడే మళ్ళీ చాలా కాలం తర్వాత థియేటర్స్ లో సరైన సినిమాలు వస్తుండడంతో మళ్ళీ థియేటర్స్ కళకళలాడుతున్నాయి. తెలుగు సహా తమిళ్ మార్కెట్ నుంచి కూడా చిత్రాలు ఒకొకటిగా వస్తూ మంచి హిట్స్ గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతున్నాయి. అయితే ముందు కొన్ని వారాలు వరకు వారానికి ఒకటీ లేదా రెండు సినిమాలు వచ్చేవి కానీ ఈ వారం మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఒరిజినల్ సహా డబ్బింగ్ వెర్షన్ లలో మొత్తం నాలుగు చిత్రాలు వచ్చాయి. మరి ఆ సినిమాలు థియేటర్స్ నుంచి తర్వాత ఎలాగో ఓటిటిలో రావాల్సిందే. సో వాటిపైన ఓ లుక్కేద్దాం రండి.
1. ‘కొరియన్ కనకరాజు’
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం డీసెంట్ టాక్ సొంతం చేసుకొని మళ్ళీ తనకి బూస్టప్ ఇచ్చేలా ఓపెనింగ్స్ అందుకుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రం తాలూకా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ సొంతం చేసుకుంది.
2. ‘డిసి’
కోలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన యువ దర్శకుడు లోకేష్ కనగకజ్ హీరోగా నటించిన మొదటి చిత్రమే ఈ ‘డిసి’. మరీ ఎక్కువ హైప్ లేకుండానే వచ్చిన ఈ చిత్రానికి కూడా మంచి టాక్ దక్కింది. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ సినిమాని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ‘సన్ నెక్స్ట్’ వారే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్నారు.
3. జి. డి. నాయుడు
వెర్సటైల్ నటుడు మాధవన్ నటించిన ఈ చిత్రం మన తెలుగు నేలకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, ఇండియన్ ఎడిషన్ గా పిలవబడే గోపాలస్వామి దొరస్వామి నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ పాన్ ఇండియా భాషల్లో విడుదల అయ్యింది. కృష్ణ కుమార్ రామకుమార్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రాన్ని కూడా నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు.
4. ‘కే జె క్యూ’
టాలీవుడ్ నుంచి వచ్చిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహించగా దివంగత దర్శకుడు కేకే (కిరణ్ కుమార్) తెరకెక్కించారు. దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ డ్రామా ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నారు.
సో ఇలా మొత్తానికి ఈ వారం థియేట్రికల్ సినిమాలు వాటి రన్ తర్వాత ఈ పాపులర్ ఓటిటిలలో సందడి చేయనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
