
ప్రముఖ నటి శ్రీదేవి ఆదివారం తెల్లవారుజామున దుబాయ్ లోని హోటల్ గదిలో గుండె సంబంధిత సమస్యతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దుర్వార్తతో యావత్ దేశం నివ్వెరపోయింది. ముఖ్యంగా సినీ పరిశ్రమలైతే ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక శోక సంద్రంలో మునిగిపోయాయి. సినీ ప్రముఖులంతా శ్రీదేవితో తమ అనుభంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
ఇక ఈరోజు దుబాయ్ లో శవపరీక్షల అనంతరం శ్రీదేవి భౌతిక కాయం ప్రత్యేక విమానం ద్వారా ముంబై చేరుకోనుంది. ముంబైలోనే ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ముంబైకి వెళుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడ ముంబై చేరుకోగా తెలుగు ప్రముఖులు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాఘవేంద్రరావు వంటి వారంతా ముంబై పయనమయ్యారు.