
దక్షిణ భారత దేశ సినీ పరిశ్రమలో ఘన కీర్తిని సాధించిన గొప్ప గొప్ప నటులంతా ఒకే చోట చేరి ఫోటో తీయించుకుంటే ఎలా ఉంటుంది. అద్భుతంగా ఉండదూ ? ఆ అద్భుతాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు. అభిమాన సినీ తారలు ఒక్కరిని ఫోటోలో చూస్తేనే ఫోటో అందంతో, కలలా కళకళలాడుతూ నిండిపోతుందే… అలాంటిది ఇలా అందరూ ఒక్కచోట చేరి ఫోటో దిగడం నిజంగా కనులవిందే.
ఈ ఫోటోలో తెలుగులో సూపర్ స్టార్లైన ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, ఎస్వీఆర్‌లతో పాటు తమిళ సూపర్ స్టార్లైన ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి తారలందరినీ చూడొచ్చు.