తెలుగులో రీమేక్ కానున్న ‘స్పెషల్ 26’

Special-26
2013లో బాలీవుడ్ లో విడుదలైన హిందీ సినిమా ‘స్పెషల్ 26’ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా గెలుచకుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని సౌత్ ఇండియన్ అన్ని భాషల్లోనూ(తెలుగు, తమిళ్ , కన్నడ మలయాళం) రీమేక్ చేయనున్నారు.

ఈ స్పెషల్ 26 హిందీ మూవీ రైట్స్ ని తమిళ డైరెక్టర్ త్యాగరాజన్ సొంతం చేసుకున్నాడు. ‘స్పెషల్ 26 ని రీమేక్ చేసే గోల్డెన్ ఛాన్స్ నాకు దక్కింది. సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో రీమేక్ చేసాను, అది కూడా నా డైరెక్షన్ లో ఉంటుందని’ త్యాగరాజన్ తెలిపాడు. ఇటీవలే త్యాగరాజన్ ‘క్వీన్’ రీమేక్ రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా కూడా తెలుగు తమిళ భాషల్లో తీయాలనే ఆలోచనలో ఉన్నారు.

Exit mobile version