ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. పైగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారట. కాగా ఈ స్పెషల్ సాంగ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలో క్రేజీ బ్యూటీ ‘ రష్మిక మందాన’ ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించనుందనే వార్త వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
