ఇండియన్ మార్కెట్ లో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ లేటెస్ట్ వసూళ్లు!

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో ర్యాంపేజ్ సృష్టిస్తున్న లేటెస్ట్ హాలీవుడ్ చిత్రమే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. మార్వెల్ సంస్థ అలాగే సోనీ పిక్చర్స్ వారికి ఊహించని నంబర్స్ చూపిస్తున్న ఈ చిత్రం రికార్డులు కొల్లగొడుతుంది. అయితే ఈ చిత్రం ఇండియన్ మార్కెట్ లో కూడా కనీ వినీ ఎరుగని రీతి వసూళ్లు రాబడుతుంది.

ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ దగ్గర 300 కోట్లకి పైగా గ్రాస్ మార్క్ ని దాటేసిన ఈ సినిమా ఇప్పుడు 300 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ని కూడా దాటేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో మొత్తంగా వసూళ్లు సుమారు 400 కోట్ల గ్రాస్ కి చేరుకున్నట్టు తెలుస్తుంది.

సో ఇండియన్ మార్కెట్ లో ఆల్ టైం హైయెస్ట్ హాలీవుడ్ గ్రాసర్ అవ్వడానికి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎక్కువ సమయం తీసుకునేలా లేదని చెప్పాల్సిందే. ఇక ఈ చిత్రంలో టామ్ హోలాండ్, జెండాయ జంట నటించగా డెస్టిన్ డానియల్ దర్శకత్వం వహించారు.

Exit mobile version