స్పిరిట్ : మళ్లీ రచ్చకెక్కిన టైటిల్ వివాదం..!

Spirit

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ చిత్రం టైటిల్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ అనే ఇండిపెండెంట్ తెలుగు చిత్ర నిర్మాతలు తమ సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుందని.. ‘స్పిరిట్’ టైటిల్ హక్కులు తమవేనని క్లెయిమ్ చేస్తున్నారు.

ప్రభాస్ టీమ్ పెట్టిన కొన్ని షరతులు నచ్చకపోవడంతో వారు ఫిలిం ఛాంబర్, సెన్సార్ బోర్డ్‌ను ఆశ్రయించారు. ఈ వివాదం తేలే వరకు ప్రభాస్ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వద్దంటూ కోరుతూ, అవసరమైతే కోర్టులోనే తేల్చుకుంటామని సదరు చిత్ర బృందం సందీప్ వంగాకు సవాల్ విసిరింది.

అప్పటివరకు ప్రమోషన్స్‌లో ఈ టైటిల్ వాడటం ఆపాలని డిమాండ్ చేయగా.. ఈ ఆరోపణలపై ‘స్పిరిట్’ నిర్మాతలు లేదా టీ-సిరీస్ నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

Exit mobile version