పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బ్లాక్‌బస్టర్ దర్శకడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభించాడు ఈ స్టార్ హీరో. అయితే, ఈ చిత్ర షూటింగ్ మరోసారి వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా గత ఏడాదే మొదలవ్వాలి. కానీ ప్రభాస్ ఇతర సినిమాల వల్ల 2026కి వెళ్ళింది. ఇప్పుడు ‘రాజా సాబ్’ తర్వాత పరిస్థితులు మారడంతో, ఈ సినిమా షూటింగ్ మరికొంత కాలం ఆలస్యం కానుంది.
ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ సినిమాపై భారీగా డబ్బు ఖర్చు చేయడంతో, దీనిని త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలాగే, ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్ కూడా ఫిబ్రవరిలో మొదలైంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ డేట్స్ ఇచ్చి ఉండటంతో, ప్రభాస్ త్వరలోనే ఆ సెట్స్‌లో జాయిన్ కానున్నాడు.
ఈ రెండు సినిమాల వల్ల ‘స్పిరిట్’ ఆలస్యమైనా, షూటింగ్ మాత్రం ఆగలేదు. ఇప్పటికే ప్రభాస్ లేకుండా గోవాలో ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు సందీప్ రెడ్డి వంగా. చిన్న చిన్న ఆలస్యాలు ఉన్నప్పటికీ, ముందుగా ప్లాన్ చేసినట్లుగానే మార్చి 5, 2027న ‘స్పిరిట్’ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
