‘సామజవరగమన’ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత హీరో శ్రీవిష్ణు మరియు దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి టైటిల్ ఫిక్స్ అయింది. ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. అన్నట్టు ఈ చిత్రం గ్లింప్స్ ను బట్టి, డబ్బు చుట్టూ తిరిగే కథ అని.. కథలో చాలా మలుపులు ఉంటాయని.. మొత్తానికి రాబోయే సంక్రాంతి సీజన్లో ఒక వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని చిత్రబృందం హామీ ఇస్తోంది.
కాగా సంక్రాంతి పండుగ సందడిలో ఈ చిత్రం పూర్తి హాస్యభరిత అనుభూతిని అందిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఎందుకంటే.. పండుగ వాతావరణానికి పక్కా కామెడీ సబ్జెక్ట్ సరిగ్గా సరిపోతుంది. ఎలాగూ ‘సామజవరగమన’కి సూపర్ హిట్ స్క్రిప్ట్ అందించిన రైటర్స్ భాను భోగవరపు, నందు ఈ చిత్రానికి కూడా కథ-మాటలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అభిరామి, సాక్షి మహదోల్కర్, నరేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సుదర్శన్, మాస్టర్ రేవంత్ తదితరులు కీలక తారాగణంలో ఉన్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.


