ఇద్దరు హీరోయిన్ల తో రొమాన్స్ చేయనున్న యంగ్ హీరో !

Sree Vishnu Nivetha Nivetha Pethuraj

ట్యాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తో వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘మెంటల్ మదిలో’ విమర్శకులను సైతం మెప్పించి మంచి విజయం సాధించింది. ఇక తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా పట్టాలెక్కనుంది. ‘బ్రోచేవారెవరురా’ అనే వినూత్న టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నివేత థామస్ , నివేత పేతురాజ్ కథానాయికలుగా నటించనున్నారు.

క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి పెళ్లి చూపులు ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందించనుండగా ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని మన్యం క్రీయేషన్స్ పతాకం ఫై మన్యం విజయ్ కుమార్ నిర్మించనున్నారు.

Exit mobile version