యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. 1992 కాలం నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన మాడుగుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే నక్సలైట్ నాయకుడి కోసం పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు వేట కొనసాగిస్తుండగా… ఆ సీరియస్ పరిస్థితుల మధ్య శ్రీవిష్ణు తన మార్కు టైమింగ్‌తో పండించిన వినోదం టీజర్లో హైలైట్‌గా నిలిచింది.
జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా, రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ అందించిన బీజీఎం సన్నివేశాలకు మంచి జోష్ ఇచ్చింది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 9, 2026న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మొత్తానికి మరోసారి శ్రీవిష్ణు తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్తో థియేటర్లలో నవ్వులు పండించేందుకు సిద్ధమయ్యాడని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


