యంగ్ మెగా హీరోపై ప్రశంశల వెల్లువ.!

kanche
స్వతహాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆ ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరో వరుణ్ తేజ్. గత ఏడాది చివర్లో ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ కి మొదటి సినిమాతో మంచి మార్కులే పడ్డాయి. మొదటి సినిమాతోనే ఓ డిఫరెంట్ సినిమా ట్రై చేసిన వరుణ్ తేజ్ రెండవ సినిమాతో దానికి మించిన డిఫరెంట్ అటెంప్ట్ తో రానున్నాడు. ఆ సినిమానే ‘కంచె’. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలను అందించిన క్రిష్ ఈ సినిమాకి దర్శకుడు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిన్న కంచె ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమా కోసం తనను తాను మార్చుకున్న విధానం, టీజర్ లో తన వాయిస్ మాడ్యులేషన్ కి సింప్లీ సూపర్బ్ గా రెస్పాన్స్ వస్తోంది. ఈ విషయంలో వరుణ్ తేజ్ కి అందరి నుంచి ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మరియు వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ లవ్ స్టొరీలో భారీ వార్ ఎపిసోడ్స్ కూడా ఉండనున్నాయి. ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం లోఫర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కంచె సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version