హన్సికకు విలన్‌గా శ్రీశాంత్ ?

sree

తమిళంతో పాటు తెలుగులో కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది హన్సిక. ప్రస్తుతం తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ చేస్తున్న ఆమె తమిళంలో మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. హర్రర్ జానర్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడే హన్సిక అలాంటి ప్రాజెక్ట్ ఒకదానికి సైన్ చేసిందట. ఇందులో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటిస్తాడని తెలుస్తోంది. అది కూడా ప్రతినాయకుడి పాత్రలో కావడం విశేషం.

హరి శంకర్, హరీశ్ నారాయణ్ అనే ఇద్దరు దర్శకులు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. వీరు గతంలో ‘అంబులి’ అనే తమిళ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని రంగనాథన్ నిర్మించనున్నాడు. ఇటీవలే అయన, ఇద్దరు దర్శకులు కలిసి శ్రీశాంత్ ను కలిసి స్క్రిప్ట్ వివరించగా ఆయన ఓకే చెప్పారట.

ఇది కేవలం హర్రర్ సినిమా మాత్రమే కాదని, ఇందులో కామెడీ కూడా ఉంటుందని టీమ్ చెబుతున్నారు. ఇకపోతే శ్రీశాంత్ గతంలో ‘టీమ్ 5’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version