
కోలీవుడ్ లో వినిపిస్తున్నసమాచారం ప్రకారం తమిళ సినిమా రంగంలోకి శ్రీదేవి మరోసారి అడుగుపెట్టనుంది. విజయ్ నటిస్తున్న ఫ్యాంటసీ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించనుంది. చింబుదేవన్ ఈ సినిమాకు దర్శకుడు. సుదీప్ ఒక ముఖ్య పాత్ర పోషించనున్నాడు
ముందుగా కమల్ హాసన్, రజినికాంత్ ల సినిమాలలో వారి సరసన శ్రీదేవి నటించనుందని పుకార్లు వచ్చాయి. ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాతో ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది. విజయ్ లో ఈమె పాత్ర రూపకల్పన ఎలా వుండనుందో ఆసక్తికరంగా మారనుంది
ఇటీవలే కోన వెంకట్ శ్రీదేవి గారికి ఒక కధను చెప్పారట. ఆ కధ ఈమెకు చాలా నచ్చిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు