ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి త్వరలోనే ఓ సినిమాలో తల్లి పాత్రలో కనిపించనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అది కూడా తమిళ సినిమాలో అని అంటున్నారు. విషయంలోకి వెళితే తమిళ స్టార్ హీరో ఇలయథలపథి విజయ్ హీరోగా నటించనున్న సినిమాలో హన్సిక ఒక హీరోయిన్ గా కనిపించనుంది. ఈ చిత్ర డైరెక్టర్ చింబుదేవన్ ఇప్పటికే శ్రీదేకి కథని వినిపించగా, శ్రీదేవి తన పాత్ర విషయంలో సముఖత వ్యక్తపరించిందని సమాచారం.
శ్రీదేవి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ చిత్ర టీం షూటింగ్ కి సిద్దమవుతున్నారు. ఈ చిత్ర కోసం చెన్నైలో ఓ భారీ సెట్ ని కూడా నిర్మించారు. కన్నడ స్టార్ సుధీప్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా తర్వాత శ్రీదేవి చేస్తున్న ఫుల్ లెంగ్త్ సినిమా ఇది. మరి ఈ సినిమాలో శ్రీదేవి ఎలా కనిపించి ఎంతమందిని ఆకట్టుకుంటుందో చూడాలి..
