కంగనాను దెబ్బతీయడానికి శ్రీదేవిని వాడుకున్నారా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దివంగత నటి శ్రీదేవి డెత్ రిపోర్ట్ సంచలనంగా మారింది. ఆమెది సహజ మరణం కాదని ఆ సమయంలో ఆమె ఆల్కహాల్, కొకైన్ సేవించి ఉన్నారని, ఆమె చేతికి గాయాలు ఉన్నాయని ఆ రిపోర్ట్ లో ఉంది. వైరల్ అవుతున్న ఆ రిపోర్ట్ దుబాయ్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఉంది. దీనిపైన నిజానిజాలు తెలుసుకోవాలని కొన్ని మీడియా సంస్థలు రంగంలోకి దిగి అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేల్చివేశాయి.

ఐతే ఇక్కడ విషయం ఏమిటంటే ఆ రిపోర్ట్ కంగనా రనౌత్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్లు కొందరు క్రియేట్ చేశారు. నిజానికి కంగనా రనౌత్ కి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లేదు. ఇది తెలియని నెటిజెన్స్ కంగనా రనౌత్ పై విరుచుకుపడుతున్నారు. కంగనా రనౌత్ అంటే గిట్టని వారు శ్రీదేవి డెత్ రిపోర్ట్ పేరుతో ఆమె ఇమేజ్ డామేజ్ చేయడానికి ప్రయత్నించారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే కంగనాకు బాలీవుడ్ లో చాలా మంది శతృవులు ఉన్నారు.

Exit mobile version