అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరోస్ లో ఒకరుగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో నాని. ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ లేక సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నాని తన తదుపరి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాని చివరి దశకు తీసుకు వచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే నాని తన తదుపరి సినిమా మారుతి డైరెక్షన్ లో ఉంటుందని ఇది వరకే తెలియజేశాం. కథ, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా శ్రీ దివ్యని ఎంపిక చేసారు. ‘మనసారా’ నిమాతో హీరోయిన్ గా మారిన శ్రీ దివ్య ఆ తర్వాత బస్ స్టాప్ సినిమాలో నటించింది. ప్రస్తుతం కొలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామని మరోసారి మారుతి తన సినిమా కోసం ఎంపిక చేసారని సమాచారం. ఈ సినిమా కొత్త జోనర్ లో ఉంటుందని మారుతి తెలియజేశాడు.
