తనను భరించినందుకు నిర్మాతకు శ్రీకాంత్ స్పెషల్ థ్యాంక్స్..!

తనను భరించినందుకు నిర్మాతకు శ్రీకాంత్ స్పెషల్ థ్యాంక్స్..!

Published on Sep 26, 2026 10:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రం నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది. హీరో నాని మార్కెట్ పరిమితుల కంటే మించి, దర్శకుడి ప్రతిభపై మరియు కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. గురువారం విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో రాణిస్తోంది.

ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ వేడుకల్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా తనను భరిస్తూ, ఈ ప్రాజెక్ట్‌ను నమ్మి ముందుకు నడిపించినందుకు నిర్మాత సుధాకర్ చెరుకూరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే వేదికపై నానితో తనకున్న విభేదాల రూమర్లపై కూడా శ్రీకాంత్ ఓదెల స్పందించారు. చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో చర్చలు, భిన్నాభిప్రాయాలు జరిగిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు.

సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావడం కోసమే ఆ చర్చలు జరిగాయని స్పష్టం చేస్తూ, ఈ చిత్రానికి రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు