‘శ్రీమంతుడు’.. థియేటర్లకు వచ్చేశాడు..!

Srimanthudu
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరోను ‘శ్రీమంతుడు’గా చూస్తామా అని చూసిన ఎదురుచూపులకు నేటితో తెరపడనుంది. మహేష్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సుమారు 1700 వందల థియేటర్లలో మార్నింగ్ షోతో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఇప్పటికే తెల్లవారుజామున పలు చోట్ల బెనిఫిట్, చారిటీ షోస్ ప్రదర్శితమయ్యాయి. మహేష్ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు, రిలీజ్ రోజు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు.

మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్, శ్రీమంతుడు టీమ్ చేపట్టిన ప్రమోషన్స్.. అన్నీ కలిపి ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మొదటిసారి మహేష్ సినిమా తమిళ డబ్బింగ్ రిలీజ్ తెలుగు రిలీజ్ రోజే జరగడం ‘శ్రీమంతుడు’ విషయంలో విశేషంగా కనిపించే అంశం.

Exit mobile version