
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో మరోసారి జూలు విదిలించి బాక్స్ ఆఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తున్నాడు. మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బెనిఫిట్ షోస్ నుంచే సూపర్బ్ మౌత్ టాక్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా రిలీజ్ అయిన ప్రతి ఏరియాలోనూ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని నమోదు చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ కి మొదటి వారం పూర్తయ్యేలోపే లాభాలు తెచ్చిపెట్టే దిశగా దూసుకుపోతోంది. ఫస్ట్ వీకెండ్ లోనే ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని 40 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది.
మొదటి వీకెండ్ లో కలెక్షన్స్ అదరగొట్టిన ఈ సినిమా వీక్ డేస్ లో కలెక్షన్స్ ఎలా ఉంటాయా అని కొంతమంది ట్రేడ్ రిపోర్ట్స్ ఆందోళనలో ఉన్నారు. వారి ఆందోళనకి చెక్ పెడుతూ.. శ్రీమంతుడు సినిమా వీక్ డేస్ లో కూడా అందరినీ థియేటర్స్ కి రాబట్టుకుంటోంది. అంతే కాకుండా వీకెండ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా వీక్ డేస్ లో కూడా కలెక్ట్ చేస్తోంది. దీనితో డిస్ట్రిబ్యూటర్స్ అంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. యువత, మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తున్నారు. కొరటాల శివ ఓ సోషల్ మెసేజ్ ని ఓ కుటుంబ కథకి జోడించి తెరకెక్కించిన విధానం అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది.