నైజాంలో 15 కోట్ల మార్క్ కి దగ్గరైన ‘శ్రీమంతుడు’

Srimanthudu
ఒక క్రేజీ కాంబినేషన్ లో, ఒక సోషల్ మెసేజ్ చెబుతూ కమర్షియల్ గా సూపర్ హిట్ కొట్టడం అనేది అంత సులువైన విషయం కాదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ మాత్రం శ్రీమంతుడు సినిమాతో ఈ బారియర్ ని చాలా ఈజీగా దాటేసారని చెప్పాలి. ఒక సోషల్ మెసేజ్ అండర్ కరెంట్ గా చెబుతూ వచ్చినా అభిమానులకు, ప్రేక్షకులకు కావాలన్సిన అన్ని అంశాలను సరిగా పొందు పరిచి తీసిన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద హిట్ గా మారింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో సూపర్బ్ కలెక్షన్స్ సాధిస్తూ అన్ని ఏరియల్లోనూ రికార్డ్ ఫిగర్స్ ని నమోదు చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే వరల్డ్ వైడ్ గా 40 కోట్లు క్రాస్ చేసిన శ్రీమంతుడు, మొదటి 5 రోజుల్లో 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది.

అంతే కాకుండా ఓవర్సీస్ లో 6 రోజుల్లో 2.2 మిలియన్ కలెక్ట్ చేసి ఓవర్సీస్ టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో సెకండ్ సినిమాగా నిలిచింది. శ్రీమంతుడు సినిమా నైజాంలో కూడా సూపర్బ్ కలెక్షన్స్ సాధిస్తోంది. నైజాం నుంచి అందిన ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మొదటి 6 రోజుల్లో 13.7 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది. నేటితో 15 కోట్ల మార్క్ కి దగ్గరయ్యేలా ఉన్న శ్రీమంతుడు శుక్రవారం కల్లా కచ్చితంగా 15 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. నైజాంలో బాహుబలి తర్వాత ఆ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తూ శ్రీమంతుడు రికార్డ్స్ సృష్టిస్తోంది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

Exit mobile version