
ఘట్టమనేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘శ్రీమంతుడు’ సినిమా ఈ రోజు ఉదయం నుంచి థియేటర్స్ లో సందడి మొదలు పెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమాకి సంబందించిన బెనిఫిట్ షోస్ ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే మొదలయ్యాయి. అన్ని ఏరియాల నుంచి ఒకటే వార్త.. సినిమా సూపర్బ్ గా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మరో సూపర్ హిట్. అలాగే మహేష్ బాబు నటననకి అందరూ నీరాజనాలు పడుతున్నారు. ఇరు రాష్ట్రాలతో పాటు, తమిళ నాడు, ఓవర్సీస్ నుంచి కూడా ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
బెనిఫిట్ షోస్ నుంచే టోటల్ పాజిటివ్ మౌత్ టాక్ స్పీడ్ అవుతున్న ఈ సినిమాకి ఉన్న క్రేజ్ సాయంత్రం కల్లా మరింత ఎక్కువ పెరగనుంది. మహేష్ బాబు మెస్మరైజింగ్ పెర్ఫార్మన్స్ మరియు ఓ సోషల్ కంటెంట్ ని చాలా కమర్షియల్ గా చెప్పడం ఈ సినిమాకి మేజర్ హైలైట్ అయ్యిందని అందరూ చెబుతున్నారు. అలాగే మహేష్ ని ఇది వరకూ చూపించని డిఫరెంట్ లుక్స్ లో చూపించడం ఫాన్స్ ని థ్రిల్ చేస్తోంది. మరోవైపు ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్స్ తోనే సుమారు $500K కలెక్ట్ చేసింది. మహేష్ బాబు సరసన శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషించారు.