ఎప్పుడెప్పుడు తమ హీరోను తెరపై ‘శ్రీమంతుడు’గా చూస్తామా అని చూసిన మహేష్ అభిమానులకు నిన్నటితో ఆ ఎదురుచూపులకు తెరపడింది. తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజున మహేష్ అభిమానులే కాక, సాధారణ ప్రేక్షకులూ థియేటర్ల ముందు క్యూ కట్టారు. మహేష్ సినిమా అంటే ఉండే క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయగా, విడుదలైన అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు హిట్ టాక్ కూడా రావడంతో సాయంత్రానికి థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం మరింత పెరిగింది.
ఇక అంతా అనుకున్నట్లుగా మొదటి రోజు శ్రీమంతుడు సినిమా కలెక్షన్లలో కూడా శ్రీమంతుడే అని నిరూపించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 కోట్ల రూపాయల షేర్ కొల్లగొట్టిన ఈ సినిమా, ఒక్క నైజాం ఏరియాలోనే 5.60 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇక సినిమాకు మంచి టాక్ రావడంతో వీకెండ్ కలెక్షన్స్ కూడా ఇదే జోరు కొనసాగిస్తాయని అంచనా. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. మహేష్ సరసన్ శృతి హాసన్ హీరోయిన్గా నటించారు.
