‘శ్రీమంతుడు’ పశ్చిమ గోదావరి ఫస్ట్‌డే కలెక్షన్స్

Srimanthudu
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘శ్రీమంతుడు’. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో పెద్ద ఎత్తున విడుదలైంది. ఊరిని దత్తత తీసుకోవడమనే అంశాన్ని సున్నితమైన ఫ్యామిలీ సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి తీసిన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటిరోజు ఈ సినిమా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డ్‌లతో కనిపించి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి.

ఇక పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఈ సినిమా మొదటిరోజు సుమారు 1.90 కోట్ల రూపాయల షేర్ సాధించి శ్రీమంతుడి సత్తా చాటింది. పశ్చిమ గోదావరిలో మొదటి రోజు కలెక్షన్లను బట్టి చూస్తే ఈ సినిమా నేటితో బ్రేక్ ఈవెన్‌‌ను చేరుకుంటుందని అంచనా. మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఇదే స్థాయిలో కొనసాగుతాయని సమాచారం. ఇక ఒక్క ఈ ప్రాంతంలోనే కాక, ఏపీ, తెలంగాణాల్లోని అన్ని ప్రాంతాల్లో శ్రీమంతుడు మొదటిరోజు మంచి కలెక్షన్లు కొల్లగొట్టిందని తెలుస్తోంది.

Exit mobile version