ఓవర్సీస్ : రికార్డ్ లొకేషన్స్ లో శ్రీమంతుడు ప్రీమియర్స్

Srimanthudu
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్స్ లో సందడి చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’ ఆగష్టు 7న తెలుగు,తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో కలిపి అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక్క లోకల్ లోనే కాకుండా మహేష్ బాబుకి ఫుల్ క్రేజ్ ఉన్న ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాని భారీగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు క్రేజ్ తో పాటు ఈ చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు యుఎస్ లో డిస్ట్రిబ్యూటర్స్ కావడం వలన రికార్డ్ లొకేషన్స్ లో ఈ సినిమా ప్రీమియర్స్ వేయడానికి ఫిక్స్ అయ్యారు.

లేటెస్ట్ గా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం ఓవర్సీస్ లో ‘శ్రీమంతుడు’ సినిమా ప్రీమియర్స్ ని 160 లొకేషన్స్ లో వేయనున్నారు. ఇది మహేష్ బాబు కెరీర్లోనే అత్యధికం కావడం విశేషం. చెప్పాలంటే ఆగడు సినిమా ఓవరాల్ గా రిలీజ్ అయ్యిందే 150 లొకేషన్స్ లో కానీ ఈ సారి కేవలం శ్రీమంతుడు ప్రీమియర్స్ ని మాత్రమే 160 లొకేషన్స్ లో వేసి రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఓవరాల్ గా సినిమాని 170కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయనున్నారు. మహేష్ బాబు సినిమా ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చెయ్యడం కూడా ఇదే ప్రధమం. మహేష్ బాబు ఈ సినిమా ఓవర్సీస్ ఆడియన్స్ కి కచ్చితంగా నచ్చుతుందని, అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుందని చాలా నమ్మకంగా ఉన్నాడు.

మహేష్ బాబు – శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుకన్య, రాహుల్ రవీంద్రన్, సనమ్ శెట్టి, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version