‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న కొత్త ప్రేమకథా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ జంటగా నటిస్తున్న ఈ సినిమా రన్‌టైమ్ వివరాలను వెల్లడించడంతో పాటు బుకింగ్స్‌ను కూడా మేకర్స్ అందుబాటులోకి తెచ్చారు.
ఈ సినిమా నిడివిని 2 గంటల 35 నిమిషాలు (155 నిమిషాలు) గా లాక్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. గాఢమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. విడుదల సమయం దగ్గర పడటంతో ప్రముఖ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.
సి. అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్, వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్లపై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనుండగా, జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది.
