తీవ్ర స్థాయికి చేరిన శ్రీరెడ్డి నిరసన !

తెలుగు పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ మూలాన తనలాంటి అమ్మాయిలో మోసపోయారని, తెలుగమ్మాయిలంటే అందరూ చులకనగా చూస్తున్నారని, సరైన అవకాశాలు ఇవ్వడంలేదని గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీపై తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తూ వచ్చిన నటి శ్రీరెడ్డి తన నిరసనను తీవ్రతరం చేశారు.

ఈరోజు హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్న ఆమె ఛాంబర్ ఆవరణలో అర్థ నగ్న నిరసన చేశారు. ఇంత జరుగుతున్నా ఇండస్ట్రీ పెద్దలు స్పందించడంలేదని, తెలుగమ్మాయిలకి సినిమాల్లో 70 శాతం అవకాశాలు కల్పించాలని, మూడు సినిమాలు చేసిన తనకు మా అసోసియేషన్ సభ్యత్వం ఇవ్వాలని, ఇప్పటికైనా పెద్దలు తమకు న్యాయం చేయకపోతే నిరసన ఇంకా తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న స్థానిక పోలీసులు ఆమెను న్యూసెన్స్ కేసు కింద అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version