ఇంతపెద్ద దర్శకుడిని అయ్యాక కూడా ఇంకా ఆలోచిస్తున్నా: రాజమౌళి

i-audio
2015 సంక్రాంతికోసం ఎంతమంది ఎదురుచుస్తున్నారో తెలియదు గానీ ఆరోజు విడుదలకానున్న ‘ఐ’ సినిమాకోసం మాత్రం సినీ ప్రియులు మాత్రం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తెలుగు ఆడియో ఈరోజు హైదరాబాద్ లో విడుదలచేశారు.

ఈ వేడుకకు ముఖ్యఅతిధులుగా హాజరైన త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి మరియు బోయపాటి శీనులు దర్శకుడు శంకర్ విజ్ఞానాన్ని, క్రియేటివ్ నెస్ ని కీర్తించారు. ముఖ్యంగా రాజమౌళి ‘నేను ప్రేమికుడు సినిమా టైం లో అసిస్టంట్ డైరెక్టర్ గా చేస్తున్న రోజుల్లో శంకర్ ఎలా ఆలోచించి తీస్తారు అని ఆలోచించేవాడిని, ఇప్పుడు ఐ సినిమా ట్రైలర్ చూశాక కూడా ఇంత పెద్ద దర్శకుడిని అయ్యాక కుడా అలాగే ఆలోచిస్తున్నా’ అదీ శంకర్ గొప్పతనం అని కీర్తించారు. తెలుగు వెర్షన్ కి పాటలు రాసిన రచయితలు స్టేజ్ పైన సినిమాతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. శంకర్, చియాన్ విక్రమ్ లు ఈ సినిమాకోసం తామెంత కష్టపడ్డామో కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. ఏ.ఆర్ రెహమాన్ అందించిన స్వరాలు ఇప్పటికే ఇన్స్టంట్ హిట్లుగా నిలిచాయి

Exit mobile version