‘సింగ్ గీతం’కు రాజమౌళి సర్‌ప్రైజ్.. ఏమిటంటే..?

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు అంటే ఉన్న గౌరవం, అభిమానం గురించి అందరికీ తెలిసిందే. సింగీతం అద్భుతమైన కథాంశాలు, ఊహాశక్తి తరాల తరబడి దర్శకులను ఎలా ప్రభావితం చేశాయో రాజమౌళి పలు సందర్భాల్లో కొనియాడారు.

ముఖ్యంగా, విజువల్ ఎఫెక్ట్స్ అందుబాటులో లేని ఆ రోజుల్లోనే ‘విచిత్ర సోదరులు’ సినిమాలో కమల్ హాసన్‌ను పొట్టివాడిగా చూపించిన అద్భుతమైన విధానాన్ని రాజమౌళి తరచూ ఒక గొప్ప ఉదాహరణగా ప్రస్తావిస్తుంటారు.

ఇప్పుడు, సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ చిత్రంతో మళ్లీ మెగా కమ్‌బ్యాక్‌కు సిద్ధమవుతుండటంతో, రాజమౌళి ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే, రాజమౌళి మొదటి టికెట్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు అధికారికంగా తన మద్దతును తెలుపుతూ మొదటి ప్రేక్షకుడిగా ఆయన నిలిచారు. దీంతో చిత్ర యూనిట్ రాజమౌళికి థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.

Exit mobile version