టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇదే సినిమాని పివిపి సినిమా వారు ‘వల్లవనుక్కు పుళ్ళుం ఆయుధం’ అని తమిళ్ లో రీమేక్ చేసారు. ఇక్కడ సునీల్ చేసిన పాత్రం తమిళ్ టాప్ కమెడియన్ సంతానం పోషించాడు.
ముందుగా ఈ సినిమా మే 16న రిలీజ్ కావాలి కానీ కొచ్చాడియాన్ వాయిదా పడడంతో ఒక వారం ముందే వచ్చేసింది. అలా అనుకున్న 48 గంటల్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయడం, అలాగే భీభత్సంగా ప్రమోషన్స్ చేయడం వల్ల ఈ సినిమా అందరికీ రీచ్ అయ్యింది. ఈ తమిళ రీమేక్ సుమారు 300కి థియేటర్లకి పైగా మే 9న విడుదలైంది. విడుదలైన మొదటి షో నుంచే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో తమిళ ఇండస్ట్రీ ఈ సినిమాని సూపర్ హిట్ గా డిక్లేర్ చేసింది.
