SSMB 29 : డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెడీ అవుతున్న జక్కన్న అండ్ టీమ్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 మూవీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ వ్యయంతో నిర్మించనుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే కథ సిద్ధమైన ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

ఇక తన సినిమాల ప్రారంభానికి ముందే తాను ఎటువంటి కాన్సెప్ట్ తో మూవీ తీస్తున్నాను అనే విషయం ముందుగానే మీడియాకి వెల్లడిస్తుంటారు రాజమౌళి. అయితే ఈ మూవీ విషయమై జక్కన్న అండ్ టీమ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకి రానుందట. త్వరలో అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ కి రెడీ అవుతున్న ఆయన టీమ్, మూవీకి సంబంధించి మరోవైపు ఒక గ్రాండ్ కాన్సెప్ట్ వీడియోని సిద్ధం చేస్తోందట. మూవీ కోసం తాము తీసుకుంటున్న కథాంశం, అలానే క్యారెక్టర్స్ కి సంబంధించిన అంశాలు ఈ వీడియోలో చూపిస్తారట. త్వరలో దీనికి సంబంధించి మూవీ టీమ్ నుండి అధికారికంగా వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version